Scam In Telugu Academy: తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌పై సీసీఎస్ దర్యాప్తు - తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్
12:32 October 01
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌పై సీసీఎస్ దర్యాప్తు
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్ (Fixed Deposits Scam In Telugu Academy) వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు (CCS Police Investigation) దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు 63 కోట్ల రూపాయల డిపాజిట్లను ఎవరు దారి మళ్లించారనే విషయాలపై పోలీసులు (CCS Police Investigation) దృష్టి సారించారు. ఇప్పటికే తెలుగు అకాడమీ (Telugu academy) డైరెక్టర్‌తో పాటు పర్యవేక్షకుడు, అకౌంట్స్ విభాగానికి సంబంధించిన సిబ్బందిని ప్రశ్నించారు. బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు(CCS Police Investigation)... వాళ్లను మరోసారి ప్రశ్నిస్తున్నారు. నకిలీ పత్రాలు సమర్పించి డిపాజిట్లు కాలపరిమితి తీరక ముందే ఎవరూ విత్ డ్రా చేశారనే వివరాలను సేకరిస్తున్నారు.
తెలుగు అకాడమీ (Telugu academy) అధికారులు సమర్పించిన పత్రాల ఆధారంగానే డిపాజిట్లలోని నగదు ఇచ్చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెబుతుండగా... బ్యాంకు అధికారులే డబ్బు మాయం చేసి ఉంటారని తెలుగు అకాడమీ (Telugu academy) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అకాడమీకి చెందిన రూ. 330కోట్లు పలు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. 11 జాతీయ బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో 330 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. ఇందులో యూబీఐ, కెనరా బ్యాంకుల్లోని డిపాజిట్లను కాలపరిమితికి ముందే విత్ డ్రా చేశారు. ఏపీ వర్తక సహకార సంఘం పేరుతో సొసైటీని సృష్టించి... ఆ లేఖపై అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకుల్లోని డిపాజిట్లను (Fixed Deposits Scam In Telugu Academy) దారి మళ్లించినట్లు సీసీఎస్ పోలీసులు ప్రాథమికం(CCS Police Investigation)గా గుర్తించారు. దీని వెనక బ్యాంకు అధికారుల హస్తం ఉందా? లేకపోతే తెలుగు అకాడమీ సిబ్బందే మోసానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు (CCS Police Investigation) చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నియమించి త్రిసభ్య కమిటీ కూడా డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: Scam In Telugu Academy: మలుపులు తిరుగుతున్న కేసు.. దర్యాప్తులో కొత్త కోణాలు