ARREST:జాయింట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఎస్.ఈశ్వర్‌రెడ్డిని సీబీఐ అధికారులు సోమవారం అరెస్ట్‌చేశారు. ఓ ఇన్సులిన్‌కు అనుచితంగా అనుమతులు ఇవ్వడానికి ఓ ప్రైవేటు సంస్థ డైరెక్టర్ నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా దిల్లీలోని కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ప్రధాన కార్యాలయంలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సోమవారం సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో అయిదుగురు వ్యక్తులతోపాటు, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. దిల్లీకి చెందిన దినేష్‌దువా అనే ఓ ప్రైవేటు సంస్థ డైరెక్టర్ ఈ కేసులో అరెస్టయ్యారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన ఇన్సులిన్‌కు (ఇన్సులిన్ యాజ్‌పార్ట్ ఇంజెక్షన్) మూడో దశ ప్రయోగాలు లేకుండానే అనుమతులు మంజూరు చేయాల్సిందిగా ఆయన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులపై ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ARREST: జాయింట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఈశ్వర్‌రెడ్డి అరెస్ట్..
ARREST: జాయింట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఎస్.ఈశ్వర్‌రెడ్డిని సీబీఐ అధికారులు సోమవారం అరెస్ట్‌చేశారు. ఓ ఇన్సులిన్‌కు అనుచితంగా అనుమతులు ఇవ్వడానికి ఓ ప్రైవేటు సంస్థ డైరెక్టర్ నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా దిల్లీలోని కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ప్రధాన కార్యాలయంలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సోమవారం సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ మేరకు బెంగుళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీకి సంబంధించిన మూడు దస్త్రాలను క్లియర్‌చేస్తూ నిపుణుల మదింపు కమిటీకి సిఫార్సు చేయడానికి సదరు నిందితుడు జాయింట్ డ్రగ్ కంట్రోలర్‌కు రూ.9 లక్షలు చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇది తెలిసి సీబీఐ అధికారులు కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ ప్రధాన కార్యాలయంలో వలపన్నారు. అనంతరం దిల్లీకి చెందిన ప్రైవేటు కంపెనీ డైరెక్టర్ నుంచి జాయింట్ డ్రగ్ కంట్రోలర్ ఎస్.ఈశ్వర్‌రెడ్డి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. లంచం ఇస్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. నోయిడా, గురుగ్రామ్, పట్నా, బెంగుళూరుల్లోని 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ కేసులో దిల్లీకి చెందిన బయోఇన్నోవాట్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గుల్జిత్ సేథి, సినర్జీ నెట్‌వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన దినేష్ దువా, బెంగుళూరుకు చెందిన బయోకాన్ బయలాజిక్స్ లిమిటెడ్‌కు చెందిన అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్.ప్రవీణ్‌కుమార్, దిల్లీ సీడీఎస్‌సీఓలోని అసిస్టెంట్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అనిమేష్‌కుమార్‌లతోపాటు ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా చేర్చారు.
ఇవీ చదవండి:
TAGGED:
అమరావతి జిల్లా తాజా వార్తలు