మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో.. 74వ రోజూ విచారణ కొనసాగుతోంది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి, ఎంపీ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు.
Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డి విచారణ - ap latest news
![Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డి విచారణ ys viveka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12815830-623-12815830-1629351658002.jpg)
ys viveka
10:22 August 19
వివేక హత్యకేసులో సీబీఐ విచారణ
ఐదు రోజుల క్రితం కూడా శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సునీల్ యాదవ్ బంధువు భరత్ కుమార్.. ఇవాళ కూడా విచారణకు హాజరయ్యారు. మెకానిక్ మహ్మద్ బాషాను అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
వివేకా హత్య కేసు: 73వ రోజు సీబీఐ విచారణ.. అధికారులను కలిసిన సునీత
Last Updated : Aug 19, 2021, 11:17 AM IST