ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

YS Viveka Murder Case: కీలక దశకు వివేకా హత్యా కేసు.. ఆరుగురు అనుమానితుల విచారణ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు.. కీలక దశకు చేరుకుంది. వరుసగా 55వ రోజు విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. ఆరుగురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో తుమ్మలపల్లి యురేనియం ఉద్యోగి ఉదయ్ కుమార్‌రెడ్డి.. అనంతపురం జిల్లాకు చెందిన లోకేశ్, గోవర్ధన్‌లతో పాటు రాజు రోడ్డులోని మాచినేని గ్రాండ్ హోటల్ మేనేజర్ రాజును సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

వివేకా హత్యా కేసు
వివేకా హత్యా కేసు

By

Published : Jul 31, 2021, 1:46 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణను వేగవంతం చేసిన సీబీఐ అధికారులు.. 55వ రోజు ఆరుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ కొనసాగుతుంది. తుమ్మలపల్లి యురేనియం ఉద్యోగి ఉదయ్ కుమార్‌రెడ్డి.. అనంతపురం జిల్లాకు చెందిన లోకేశ్, గోవర్ధన్‌ విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు అనంతపురంలో రాజు రోడ్డులోని మాచినేని గ్రాండ్ హోటల్ మేనేజర్ రాజును సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

2018లో హోటల్‌కు వచ్చిన వ్యక్తుల వివరాలు అడిగిన సీబీఐ.. సునీల్ యాదవ్ హోటల్‌కు వెళ్లి ఉంటారనే సమాచారంతో మేనేజర్​ను ఆరా తీశారు. ఈ కేసులో మరింత స్పష్టత తెచ్చే దిశగా కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా.. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details