ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

CBI On YS Viveka Murder Case: వివేకా హత్య కుట్రలో శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి: సీబీఐ - వివేకా హత్య కుట్రలో శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామిగా తేల్చిన సీబీఐ

CBI On YS Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి అని సీబీఐ తేల్చింది. ఈ మేరకు వివేకా హత్యలో శివశంకర్‌రెడ్డి పాత్రపై సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల్ని న్యాయస్థానం ఎదుట ఉంచింది.

CBI On YS Viveka Murder Case
వివేకా హత్య కేసు

By

Published : Dec 23, 2021, 8:37 AM IST

CBI On YS Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారిలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి అని సీబీఐ తేల్చింది. వివేకా మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నప్పటికీ ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టింది శివశంకర్‌రెడ్డేనని స్పష్టం చేసింది. అదే విషయాన్ని ఆయనే ‘సాక్షి’ టీవీకి కూడా చెప్పారని వెల్లడించింది. వివేకా గుండెపోటుతోనే మరణించారంటూ అందర్నీ నమ్మించేందుకు వీలుగా పడక గది, స్నానపు గదిలోని రక్తపు మరకలన్నింటినీ తుడిపించేశారని, ఘటనా స్థలంలో హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని వివరించింది.

YS Viveka Murder Case news: ఆ క్రమంలోనే వివేకా శరీరంపై ఉన్న గాయాలన్నింటికీ గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో బ్యాండేజీ వేయించి కట్లు కట్టించారని తెలిపింది. వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ గత నెల 17న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. జ్యూడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఆయన బెయిలు మంజూరు కోసం కడప నాలుగో అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేశారు. అంతకు ముందు దీనిపై వాదనల సందర్భంగా వివేకా హత్యలో శివశంకర్‌రెడ్డి పాత్రపై తమ దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల్ని న్యాయస్థానం ఎదుట సీబీఐ ఉంచింది. అందులోని ప్రధానాంశాలు..

దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు..

  • కొందరు సాక్షులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు. కొత్త కొత్త పేర్లు తెరపైకి తీసుకొస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు.
  • కుట్రకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం చాలా కీలక దశలో ఉంది. ఇలాంటి దశలో శివశంకర్‌రెడ్డికి బెయిలిస్తే ఆయన ఆధారాలు తారుమారు చేసే, పరారయ్యే అవకాశం ఉంది.
    గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని చెబుతాం
  • వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితులు కుట్ర చేశారు. హత్యకు నెల రోజుల ముందే దీనికి రూపకల్పన జరిగింది. వివేకాను చంపితే భారీ మొత్తంలో డబ్బులిస్తానని యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిలకు శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ చేశారు.
  • ‘వివేకా గుండెపోటుతో చనిపోయారు. ఆయన ఇంటి వద్ద భారీగా జనం గుమికూడుతున్నారు. వెంటనే అక్కడికి వచ్చి జనసందోహాన్ని నియంత్రించాలి’ అంటూ పులివెందుల సీఐను శివశంకర్‌రెడ్డి సంప్రదించారు.
  • ‘వివేకా గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారంటూ మేము చెబుతాం. ఈ వ్యవహారంలో నోరుమూసుకుని ఉండాలి’ అంటూ సీఐ శంకరయ్యను, ఘటనా స్థలంలోని సాక్షుల్ని శివశంకర్‌రెడ్డి దుర్భాషలాడారు.
  • రక్తపు మరకలు శుభ్రం చేస్తున్న సందర్భంలోనూ, గాయాలకు బ్యాండేజీ వేసి కట్లు కడుతున్న సమయంలోనూ లోపలి నుంచి తలుపులేసేశారు. శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితుల ఆదేశాల మేరకే అలా చేశారు.
  • వివేకా మృతి వార్త తెలిసి అక్కడికి వచ్చిన వారందర్నీ... ఆయన రక్తపు వాంతులు, గుండెపోటుతో చనిపోయారంటూ పేర్కొంటూ శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితులు నమ్మించారు.

హత్య చేస్తే రూ.40 కోట్లు

  • ‘వివేకాను హత్య చేస్తే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మనకు రూ.40 కోట్లు ఇస్తారు. దీని వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు’ అంటూ ఎర్ర గంగిరెడ్డి... సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిలతో చెప్పినట్లు దస్తగిరి, వాచ్‌మన్‌ రంగన్నలు వాంగ్మూలం ఇచ్చారు.
  • హత్యకు నాలుగైదు రోజుల ముందు సునీల్‌ యాదవ్‌ దస్తగిరికి అడ్వాన్సుగా రూ.కోటి ఇచ్చారు. ఆ మొత్తంలో నుంచి రూ.25 లక్షలు సునీల్‌ యాదవ్‌ మళ్లీ ఇస్తానని చెప్పి తీసుకున్నారు.
  • దస్తగిరికి అడ్వాన్సుగా అందిన డబ్బును, ఆయన మున్నా వద్ద ఉంచారు. అందులో రూ.46.70 లక్షలు మున్నా నుంచి స్వాధీనం చేసుకున్నాం.

YS Viveka Murder Case: సీబీఐ ఎదుట తమ పేర్లు చెప్పొద్దంటూ దస్తగిరిని ప్రభావితం చేశారు

కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరిని శివశంకర్‌రెడ్డి ఈ ఏడాది మార్చిలో తన స్నేహితుడైన భయపురెడ్డి ఇంటికి పిలిపించారు. ‘సీబీఐ ఎదుట నా పేరు కానీ, మిగతా వారి పేర్లు కానీ చెప్పొద్దు. అలా చేస్తే నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తా’ అంటూ దస్తగిరికి చెప్పారు.

  • వివేకా హత్య కుట్రలో శివశంకర్‌రెడ్డి భాగస్వామ్యమయ్యారు. ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేశారు. ఆయన్ను నవంబర్‌ 17న అరెస్టు చేశాం. జ్యూడిషియల్‌ రిమాండులో ఉండగానే న్యాయస్థానం అనుమతి తీసుకోకుండా కడప కేంద్ర కారాగారం నుంచి ఆయన్ను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:YS Viveka Murder Case: వివేకా హత్యకేసు నిందితుల బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌

ABOUT THE AUTHOR

...view details