ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Accident: రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. అక్కడిక్కక్కడే ప్రాణాలుకోల్పోయిన వ్యక్తి - కారు ఢీ కొని వ్యక్తి మృతి

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఓ వ్యక్తిని బలి తీసుకుంది. తుపాన్ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో.. బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కారు ఢీకొని
కారు ఢీకొని

By

Published : Aug 8, 2021, 10:16 PM IST

తుఫాన్ వాహనం.. బైకును ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గురాజవోలు గ్రామానికి చెందిన గారపాటి ఇస్మాయిల్ వ్యక్తి గత పని నిమిత్తం నుదురుపాడు వెళ్లాడు. అక్కడ ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండుగా నరసరావుపేట వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం.. ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఇస్మాయిల్​కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పిరంగిపురం పోలీసులు మృత దేహాన్ని శవ పంచనామా నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇస్మాయిల్​కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details