Fire in Car: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో కారు దగ్థమైంది. విజయకుమార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బుచ్చి నుంచి విడవలూరు మండలంలోని భద్రాచలానికి వెళ్తుండగా రాజుపాళెం సమీపంలో కారు బానెట్ నుంచి పొగలు వచ్చాయి. అది గమనించే లోపే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన దంపతులిద్దరూ వెంటనే కారు దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు మొత్తం మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్దమైంది.
కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణాపాయం - దంపతులు సురక్షితం
Fire in Car: కారులో ప్రయాణించాలంటేనే భయం భయంగా ఉంటోంది. ఈ మధ్య ఏదో ఒకచోట వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు చూస్తున్నాం. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో నడుస్తున్న వాహనంలో నుంచి మంటలు చెలరేగగా.. అప్రమత్తమైన డ్రైవర్ అందరినీ కిందకు దించడంతో ప్రాణాపాయం తప్పింది. తాజాగా నెల్లూరు జిల్లాలోనూ అటువంటే ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు అప్రమత్తమై కిందకు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
![కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణాపాయం car fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16556432-166-16556432-1664903206885.jpg)
car fire
కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణాపాయం
Last Updated : Oct 4, 2022, 10:50 PM IST