SUICIDE: తన వల్ల ఇద్దరు మృతి చెందారని, వారి కుటుంబాలు అనాథలయ్యాయనే మనస్తాపంతో ఓ కారు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే ప్రైవేటు వాహనం డ్రైవర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఉరవకొండ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు భవన నిర్మాణ కార్మికులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదెప్ప, నాగేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం జంగాలపల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
SUICIDE: 'నా వల్ల ఇద్దరు చనిపోయారు.. నేనూ చనిపోతా' - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
SUICIDE: సహజంగా మన వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగినా లేదా నష్టం వాటిల్లినా బాధపడడమో.. లేకపోతే పరిహారం చెల్లించడమో చేస్తాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలు అనాథలయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది.
'నా వల్ల ఇద్దరు చనిపోయారు.. నేనూ చనిపోతా'
తన వల్ల ఇద్దరు మృతి చెందారని.. రెండు కుటుంబాలు అనాథలయ్యాయని స్నేహితులకు ఫోన్లో తెలిపి.. రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: