ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ACCIDENT: పామర్రు దగ్గర ఆటో-కారు ఢీ.. ఆరుగురికి గాయాలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

ACCIDENT: పామర్రు నియోజకవర్గ భాజపా ఇంఛార్జ్​ కృష్ణబాబు కారు ప్రమాదానికి గురైంది. పామర్రు మండలంలోని కొండాయిపాలెం వద్ద ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

accident
accident

By

Published : Aug 2, 2022, 7:49 PM IST

ACCIDENT: కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పామర్రు నియోజకవర్గ భాజపా ఇంఛార్జ్​ కృష్ణబాబు కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108లో గుడివాడ ఆసుపత్రికి తరలించారు. ఆటో ఢీకొనడంతో కారు కాలువలోకి వెళ్లింది. ప్రమాద సమయంలో కారులో కృష్ణ బాబు దంపతులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనపై పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details