ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Business Woman Shilpa Fraud: పార్టీలు ఇచ్చి... సెలబ్రిటీలను ఆకర్షించి కోట్లు వసూలు

Business Woman Shilpa fraud Tollywood Celebrities: అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి ప్రముఖుల నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్షర్లను ఆమె మోసం చేసినట్లు గుర్తించారు. పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను శిల్ప ఆకర్షించినట్లు తెలుస్తోంది.

business-woman-shilpa-arrested-for-cheating-celebrities
పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించి.. కోట్లలో వసూలు చేసి

By

Published : Nov 27, 2021, 1:24 PM IST

Updated : Nov 27, 2021, 1:39 PM IST

Shilpa fraud Tollywood Celebrities: ప్రముఖులను, సినీనటులను మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట ప్రముఖులకు వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి (Shilpa fraud Tollywood Celebrities) గుట్టు ఎట్టకేలకు బయటపడింది. హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కోటి 5లక్షల రూపాయల తీసుకొని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించి.. కోట్లలో వసూలు చేసి

గండిపేట సిగ్నేచర్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న శిల్ప, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీసులు ప్రశ్నించారు. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. దివ్య నుంచి కోటికి పైగా నగదు తీసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు తిరిగి చెల్లించకపోవడంతో శిల్ప, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

విలాసవంతమైన జీవితం కోసం

శిల్పా చౌదరి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ప్రముఖులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని కోట్లలో మోసాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. అధిక వడ్డీ ఇస్తానని, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి.. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్లను శిల్ప మోసం చేసినట్లు గుర్తించారు.

సెలబ్రిటీలను ఆకర్షించేందుకు పేజ్​ త్రీ పార్టీలు ఇచ్చి శిల్ప దంపతులు.. కోట్లలో కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతులు ఇద్దరు కలిసి ప్రముఖులను మోసం (Shilpa fraud Tollywood Celebrities) చేసి.. వచ్చిన డబ్బుతో ఇద్దరు కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడించారు. ఈ దంపతుల బాధితుల సంఖ్య పూర్తిగా తేలేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

Ramagundam Murder today: రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు.. ఎవరివి?

Last Updated : Nov 27, 2021, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details