Bus Accident: తమిళనాడులోని దిండిగల్ వద్ద అయ్యప్ప మాలధారులు ప్రయాణిస్తున్న మినీ బస్సు బోల్తా పడి ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన శ్రీరాములు నాయక్ కదిరి మండలం చవట తండా వాసిగా గుర్తించారు. కదిరి ప్రాంతం నుంచి అయ్యప్ప మాల ధరించిన వారు శబరిమలకు వెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలో తమిళనాడులో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు బస్సులోని అయ్యప్ప మాలధారులు తెలిపారు.
శబరి వెళ్లొస్తుండగా బస్సు ప్రమాదం.. ఒకరు మృతి - accident when returning from the Lord Ayyappa
Bus Accident: శబరిమల వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకుని వస్తున్న మాలధారుల వాహనం బోల్తా పడటంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. కదిరి ప్రాంతం నుంచి అయ్యప్ప మాలధారులు శబరిమల వెళ్లారు. వారు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం జరిగింది.
బస్సు ప్రమాదం