కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉలిందకొండ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు... హైదరాబాద్ నుంచి పలమనేరుకి వెళ్తున్న బస్సు ఉలిందకొండ వద్ద బోల్తా పడిందని పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... క్రేన్ సాయంతో బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వెంటనే వారందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే బస్సు ప్రమాదానికి గురైందని ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.
BUS ACCIDENT: డివైడర్ను ఢీకొని బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి, ఏడుగురికి గాయాలు - ఏపీ తాజా నేరవార్తలు
హైదరాబాద్ నుంచి పలమనేరుకి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఉలిందకొండ వద్ద డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా... బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
డివైడర్ను ఢీకొని బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి, ఏడుగురికి గాయాలు