Bullet bandi fame TPO Ashok caught by ACB: మీకు బుల్లెట్టు బండి సాంగ్ గుర్తుందా... అదేనండీ ఓ వధువు కట్టుకున్న భర్తతో జీవితాంతం సంతోషంగా ఉంటాననే ఆనందంతో ఆ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. పెళ్లి బరాత్‌లో వరుడి కోసం డ్యాన్స్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. అయితే అది ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా... మళ్లీ ఓసారి ఈ బుల్లెట్టు బండి విషయం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్ల జన్నారానికి చెందిన వధువు సాయి శ్రియను అదే జిల్లాలోని రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. ఇప్పుడు ఆ అశోక్ చేసిన నిర్వాహకం బయటకు వచ్చింది. అశోక్ ప్రభుత్వ అధికారి. ఇంకేముంది తన చేతివాటం చూపించాలని అనుకున్నారు. రూ.30వేలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు.