ATTACK కృష్ణా జిల్లా పోరంకి సమీపంలోని ఓ వశిష్ట క్యాంపస్ సిబ్బంది, విద్యార్థులపై.. భవన యజమాని దాడికి పాల్పడారు. కిలారు చక్రవర్తి అనే వ్యక్తి దాదాపు 15 మందితో వచ్చి.. అద్దె బకాయి చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థులు ఉన్న తరగతి గదులకు తాళాలు వేసి భయాందోళనకు గురి చేశారు. విద్యార్థులు భోజనానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కళాశాలకు చేరుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే క్రమపద్ధతిలో అద్దె చెల్లిస్తున్నట్లు, రానున్న విద్యా సంవత్సరం వరకు ఒప్పందం చేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.
అద్దె బకాయి చెల్లించాలంటూ వశిష్ట క్యాంపస్పై భవన యజమాని దాడి - వశిష్ట క్యాంపస్
OWNER ATTACK పోరంకి సమీపంలోని వశిష్ట క్యాంపస్ సిబ్బంది, విద్యార్థులపై భవన యజమాని దాడికి పాల్పడ్డారు. అద్దె బకాయి చెల్లించాలంటూ విద్యార్థులు ఉన్న తరగతి గదులకు తాళాలు వేసి భయాందోళనకు గురి చేశారు.
OWNER ATTACK
ప్రిన్సిపల్ మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోవిందరాజులు తెలిపారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తుల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారని స్థానికంగా వదంతులు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: