BTech Students: బీటెక్ విద్యార్థుల అనుచిత పనులు ఆ గ్రామస్థుల్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి జల్సా చేస్తున్న యువకుల తీరు చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు సొమ్ము కోసం నీచమైన పనులకు పాల్పడ్డారు. యువతులు, మహిళల ఫొటోలు నీలిచిత్రాల వెబ్‌సైట్లకు విక్రయించడానికి అలవాటుపడ్డారు. సంక్రాంతి సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చిన విద్యార్థినులు, గృహిణుల చిత్రాలను తీసి నీలిచిత్రాల వెబ్‌సైట్లకు పంపారు.
ఎలా బయటపడిందంటే..
BTech Students: విదేశంలో ఉంటూ పండగకు స్వగ్రామానికి వచ్చిన యువకుడు సామాజిక మాధ్యమాల్లో తన తల్లి ఫొటోతో నీలి వీడియో ఉండటాన్ని గమనించి.. ఆరా తీయగా స్థానిక యువకుల బండారం వెలుగులోకి వచ్చింది. ఇంజినీరింగ్, ఫార్మసీ చదువుతున్న ఇద్దరు యువతుల ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి నీలిచిత్రాల వెబ్‌సైట్లలో పెట్టినట్లు వారి కుటుంబ సభ్యుల దృష్టికి వచ్చింది. బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో యువకుల్లో ఒకరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మార్ఫింగ్ చేసిన నీలిచిత్రాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:Mother suicide with children : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య