భూవివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరికి కారంపొడి చల్లుకొని.. గొడ్డలి, కొడవళ్లతో దాడిచేసుకొనేంతవరకు వచ్చింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
ATTACK: భూవివాదంలో గొడ్డలి, కొడవళ్లతో దాడిచేసుకొన్న అన్నదమ్ములు - telangana crime news
భూమి కోసం ఇద్దరు అన్నదమ్ములు గొడవకు దిగారు. కారంపొడి చల్లుకొని.. గొడ్డలి, కొడవళ్లతో పరస్పరం దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.
తెలంగాణలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గార్చర్ల గ్రామంలో ఆళ్లకుంట కిష్టయ్యకు సర్వే నంబర్.. 357, 358, 359లో 20 ఎకరాల భూమి ఉంది. అతనికి నలుగురు కుమారులు.. చిన్న కురుమయ్య, శ్రీనివాసులు, చంద్రయ్య, తిరుపతయ్య సహా ఒక కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు తిరుపతయ్య 6 ఎకరాలు, కిష్టయ్య భార్య పేరున మూడున్నర ఎకరాలు భూమి పట్టా చేయించారు. మిగిలిన పదిన్నర ఎకరాల్లో మిగతా అన్నదమ్ములు భూమిని సదను చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. కారంపొడి చల్లుకొని, గొడ్డలి, కొడవళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీచూడండి:NGT: రిజర్వాయర్ల నిర్మాణ వివాదంపై జోక్యం చేసుకోలేం.. ఏపీ రైతుల పిటిషన్‌పై ఎన్జీటీ