ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Rape: సోదరిపై అత్యాచారం..బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులు - rape cases

కన్న తండ్రి ఒక్కడే.. అమ్మలే వేరు. ఆ అమ్మలిద్దరూ అక్కాచెల్లెళ్లు. మొదటి భార్య కుమారుడు.. చిన్న భార్య కుమార్తెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను ఐదు నెలల గర్భిణిని చేశాడు. ఈ ఘటన తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

brother raped his sister
చెల్లెలిని గర్భావతి చేసిన అన్న

By

Published : Jul 4, 2021, 2:13 PM IST

సొంత చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇంట్లో ఎవరూ లేని సందర్భంలో ఆ యువతిపై పలుమార్లు లొంగదీసుకుని తల్లిని చేశాడు. ఈ ఘటన తిరుపతి అలిపిరి పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది.

నగర శివారు కాలనీకి చెందిన ఓ వ్యక్తి రెండు దశాబ్దాల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు మగ పిల్లలు. ఆ తర్వాత కొంత కాలానికి సదరు మహిళ భర్తను వదిలేసి మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలను తీసుకొని వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయాక అతను.. మరదలు వరసయ్యే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వీరు తిరుపతి నగర శివారు కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా మొదటి భార్య కుమారుడు (16).. రెండో భార్య (పిన్నమ్మ) ఇంటికి వచ్చి వెళ్లేవాడు. పిన్నమ్మ కుమార్తె (14)ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెద్దలకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. గత కొన్ని రోజులుగా కుమార్తె శరీరంలోని మార్పులను గమనించిన తల్లి నిలదీసి అడగ్గా..అసలు విషయం చెప్పింది. దీంతో అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details