ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

డివైడర్​ను ఢీకొట్టిన బైకు.. అన్నాచెల్లెలు మృతి - కొత్తపల్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాలపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ద్విచక్రవాహనదారుడు.. బీ. కొత్తపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​ను తప్పించబోయి డివైడర్​ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అన్నాచెల్లెలు మృతి చెందారు.

brother and sister died in a accident at kothapalli
కొత్తపల్లి రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి

By

Published : Apr 12, 2021, 7:13 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బాట్లో కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతిచెందారు. ఓ ద్విచక్రవాహనదారుడు.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​ను తప్పించబోయి డివైడర్​కు ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మృతులు శింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు.. భాస్కర్, గీతగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details