ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడి ఆత్మహత్య - bridegroom suicide by hanging

మరికొద్ది గంటల్లో పెళ్లి.. ఇంతలో వరుడు తనువు చాలించాడు.. ఓ వైపు శుభకార్యం జరుగుతుండగానే.. తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగింది.

కాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడి ఆత్మహత్య
కాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడి ఆత్మహత్య

By

Published : Mar 10, 2021, 8:18 AM IST

పెళ్లి పనుల హడావుడితో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అప్పటి వరకు అందరి మధ్యలో ఉన్న పెళ్లి కుమారుడు మహ్మద్‌ సలీం (26) ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

సంజయ్‌ నగర్‌లోని మహ్మద్‌ ఖాజాకు ఆరుగురు సంతానం. పెద్ద కుమారుడు సలీంకు పెళ్లి చేయాలనుకున్నాడు. కుమారుడు ఆటో డ్రైవర్‌ అయినా.. ఉన్నత చదువు చదువుకున్న అమ్మాయిని కోడలిగా ఎన్నుకున్నాడు. పెళ్లి ముహూర్తానికి మరి కొన్ని గంటలే ఉంది. ఓ వైపు పెళ్లి తంతు జరుగుతుండగానే.. కుమారుడు తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పెళ్లి పనుల్లో ఉన్న కుటుంబసభ్యులు తెల్లవారుజామున వరుడి గదికి వెళ్లగా.. ఎలాంటి స్పందన రాకపోయేసరికి తలుపులు పగులగొట్టారు. సలీంలో చలనం లేకపోవటం గుర్తించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. వరుడి తండ్రి ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్.. వరదార్పణం

ABOUT THE AUTHOR

...view details