ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తిరుపతిలో విషాదం.. వరదలో చిక్కుకొని యువతి మృతి

తిరుపతిలో విషాదం.. వరదలో చిక్కుకొని యువతి మృతి
తిరుపతిలో విషాదం.. వరదలో చిక్కుకొని యువతి మృతి

By

Published : Oct 23, 2021, 10:03 AM IST

Updated : Oct 23, 2021, 6:55 PM IST

09:59 October 23

తుఫాన్‌ వాహనంలో చిక్కుకున్న ఆరుగురిని కాపాడిన పోలీసులు

తిరుపతిలో విషాదం.. వరదలో చిక్కుకొని యువతి మృతి

తిరుపతి(tirupathi)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం(karnataka) నుంచి తిరుమల శ్రీవారిని(tirumala) దర్శించుకునేందుకు వచ్చిన ఓ కుటుంబం వరదనీటిలో చిక్కుకుపోగా.. ఓ యువతి (young woman died) మరణించింది. నగరంలోని వెస్ట్‌ చర్చి సమీపంలో ఉన్న రైల్వేఅండర్‌ బ్రిడ్జ్ నీటిలో జీపు చిక్కుకుపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని(tragedy) నింపింది.  

నీటిలో చిక్కుకున్న జీపు... 

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా ముదుగల్‌ ప్రాంతానికి చెందిన భాగ్యశ్రీ.. తన ముగ్గురు కూతుళ్లు, కుమారుడు, అల్లుళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని(thirumala venkateshwara swamy) దర్శించుకునేందుకు గురువారం రాత్రి బయలుదేరారు. శుక్రవారం తమిళనాడులోని కంచిలో స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకుని, తిరుమలకు పయనమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో భాగ్యశ్రీ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం.. తిరుపతిలోని వెస్ట్‌చర్చి సమీపంలో ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జ్(railway under bridge at west church in tirupathi) వద్దకు చేరుకుంది. తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు రైల్వే అండర్‌ బ్రిడ్జ్ నీటితో నిండిపోయింది. నీటి లోతును అంచనా వేయని వాహన చోదకుడు.. జీపును ముందుకు తీసుకెళ్లడంతో మధ్యలో చిక్కుకుపోయింది.  

బయటకు రాలేక...

వాహనం వరదలో చిక్కుకున్న(vehicle trapped in flood water) సమయంలో అందులో ఏడుగురు ఉన్నారు. వారంతా వరదలో చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వర్షపు నీటిలో చిక్కుకుపోయిన ఆరుగురిని కాపాడారు. వరద నీటిలో మునిగి సంధ్య వాహనంలోనుంచి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు. సంధ్యతో పాటు జీపులో ఉన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురయింది. చికిత్స నిమిత్తం చిన్నారిని రుయా ఆస్ప్రతికి తరలించారు.

Last Updated : Oct 23, 2021, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details