ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

lover murder: ప్రియురాలి గొంతు కోసి చంపి.. ఉరివేసుకున్న ప్రియుడు - మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్‌లో మర్డర్​

అది అయిదు నక్షత్రాల హోటల్‌.. ఓ ప్రేమ జంట బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అందులో ఓ గదిని ఒక రోజుకు అద్దెకు తీసుకుంది. గురువారం మధ్యాహ్నంతో ఆ గడువు ముగిసింది. ఖాళీ చేసే సమయం అయిందంటూ సిబ్బంది సూచించారు. మరో రోజు ఉంటామంటూ చెప్పి తలుపు వేసుకున్నారు. సాయంత్రమైనా బయటకు రాకపోవడంతో అనుమానమొచ్చి హోటల్‌ సిబ్బంది మారు తాళంతో తలుపు తెరిచారు. అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి కంగుతిని పోలీసులకు సమాచారమిచ్చారు. హైదరాబాద్​ మాదాపూర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.

boyfriend who killed his girlfriend and committed suicide
boyfriend who killed his girlfriend and committed suicide

By

Published : Jul 30, 2021, 6:57 AM IST

ఓ హోటల్‌లోని బాత్రూం టబ్‌లో ప్రేమికురాలు గొంతుకు బ్లేడ్‌ గాయమై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. గదిలో ప్రేమికుడు ఆమె చున్నీతో ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలొదిలాడు. ఆమెను హతమార్చి.. అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క చాలా ఏళ్లుగా వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించడం లేదు.

అప్పుడే వారి మధ్య ప్రేమ..

తెలంగాణ వికారాబాద్‌ జిల్లా కోస్గి మండలం హకీంపేట్‌ గ్రామానికి చెందిన గుడిసె రాములు(25), బొంరాస్‌పేట మండలంలోని లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి(25) ఒకే పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. ఇంటర్‌ వరకు చదువుకున్న ఆమె హైదరాబాద్‌లో ఉంటూ ఎస్సై, కానిస్టేబుల్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా, రాములు కూడా నగరంలోనే కారు డ్రైవరుగా ఉపాధి పొందుతున్నాడు.

తలుపు తట్టినా..

బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఒక రోజుకు గదిని అద్దెకు తీసుకొన్నారు. గురువారం మధ్యాహ్నం సిబ్బంది వెళ్లి ఖాళీ చేసే సమయం అయిందని తెలియజేయగా.. మరో రోజు ఉంటామని చెప్పారు. తర్వాత పలుమార్లు తలుపు తట్టినా లోపలి నుంచి అలికిడి లేకపోవడం, సాయంత్రమైనా బయటకు రాకపోవడంతో అనుమానమొచ్చి హోటల్‌ సిబ్బంది మారు తాళంతో తలుపు తెరిచారు.

రక్తపు మడుగులో నిర్జీవంగా..

సంతోషి.. బాత్రూంలోని టబ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. గొంతుపై బ్లేడ్‌తో కోసిన ఆనవాళ్లున్నాయి. రాములు టీ-షర్ట్‌పై రక్తపు మరకలు కనిపించాయి. సంతోషిని చంపిన తరవాత అతడు ఆమె చున్నీతోనే ఫ్యానుకు ఉరేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము ఖాళీ చేయాలని చెప్పిన సమయంలోనే ఇద్దరూ గొడవ పడుతూ కనిపించారని హోటల్‌ సిబ్బంది పోలీసులకు వివరించారు. పూర్తి వివరాల కోసం మాదాపూర్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీచూడండి:

Telangana: బావిలో కారు పడిన ఘటనలో మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details