ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

బోర్​వెల్​ నిర్వాహకుల నిర్లక్ష్యం... 12 ఏళ్ల బాలుడు మృతి - Warangal rural district latest news

బోర్​వెల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. తమ కుమారుని మృతికి కారణమైన గ్రామ సర్పంచ్, బోర్​వెల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

boy dead
బాలుడు మృతి

By

Published : Jun 16, 2021, 6:13 PM IST

తెలంగాణలోని వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మోరిపిరాల సుభాష్ తండలో... గ్రామ సర్పంచ్ పల్లె ప్రకృతి వనంలో బోరు బావి తవ్విస్తున్నారు. ఆ సమయంలో బాదావత్ ఈశ్వర్ ప్రసాద్(12) అనే బాలుడు అక్కడే ఆడుకుంటున్నాడు. బోర్ వెల్ నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పైప్​లైన్ లీకై బాలుడి తలకు బలంగా తగిలింది. బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈశ్వర్ ప్రసాద్ ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుని మృతికి కారణమైన గ్రామ సర్పంచ్, బోర్​వెల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

సబ్​స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంతో... వాచ్​మెన్ మృతి

ABOUT THE AUTHOR

...view details