BOY KIDNAP IN GGH: గుంటూరు జీజీహెచ్‌లో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురి కావటం కలకలం రేపింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలేనికి చెందిన కిజియా అనే మహిళ కాన్పు కోసం నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. కిజియాతో పాటు ఆమె ఐదేళ్ల కుమారుడు వర్షిద్ హస్పిటల్‌కు వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి వరండాలో నిద్రించాడు. కాసేపటికి వర్షిద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ మహిళ వర్షిద్ను తీసుకెళ్లినట్లుగా రికార్డు అయ్యింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా జీజీహెచ్‌లో పిల్లల అపహరణకు సంబంధించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తరచుగా పిల్లల కిడ్నాప్‌లు జరుగుతున్నా.. నిఘా కొరవడటం ఆందోళన కలిగిస్తోంది.
జీజీహెచ్‌లో బాలుడి కిడ్నాప్.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
BOY KIDNAP IN GUNUTR : గుంటూరు GGHలో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. కాన్పు కోసం వచ్చిన తల్లి వెంట వచ్చిన ఆ బాలుడు రాత్రి సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
BOY KIDNAP IN GGH