గాలిపటం సరదా ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలి తీసుకొంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. గుర్రాల చావిడి వద్ద బిలాల్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మూడంతస్తుల భవనంలో నివాసం ఉంటున్నాడు. వీరి పెద్ద కుమారుడు అర్షద్ డాబా పై గాలిపటంతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అర్షద్‌ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతితో అర్షద్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
గాలిపటం ఎగరేస్తుండగా ప్రమాదం... బాలుడు మృతి
గాలిపటం సరదా ఓ బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. మూడంతస్తుల భవనంపై గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుని మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
BOY