Boy Died in Swimming Pool: సరదాగా అలా ఆడుకుందామని వెళ్లిన తొమ్మిదేళ్ల బాలున్ని స్విమ్మింగ్‌పూల్ రూపంలో మృత్యువు మింగేసింది. గృహప్రవేశం కోసం బంధువుల ఇంటికి వచ్చిన వారికి విషాదం మిగిల్చింది. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కోకాపేటలో విషాదం.. బాలుడిని మింగేసిన స్విమ్మింగ్ పూల్ - బాలుడు మృతి
Boy Died in Swimming Pool: కుమారుడంటే ఆ తల్లిదండ్రులకు ప్రాణం.. తన మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. సరదాగా ఆడుకుందామని అపార్ట్మెంట్లో ఉన్న సిమ్మింగ్పూల్కి వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
విజయవాడకు చెందిన విజయ్ కుమార్, పద్మా రాణి దంపతులు శనివారం మధ్యాహ్నం కోకాపేటలోని బంధువుల ఇంటికి గృహ ప్రవేశానికి వచ్చారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్యామ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఆ బాలుడు అలా ఆడుకుందామని అపార్ట్మెంట్లోని స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లాడు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే వారితో పాటు చేరాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా శ్యామ్ నీటిలో మునిగిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చాలా సేపటికి బాలుడు ఇంకా రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ ప్రాంతమంతా వెతికారు. చివరికి స్విమ్మింగ్ పూల్ దగ్గరకి వెళ్లగానే అక్కడ కుమారుడు అచేతన స్థితిలో ఉన్నాడు. వెంటనే తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇవీ చదవండి: