ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కర్నూలు​లో విషాదం.. బాణసంచా పేలి బాలుడు మృతి - AP Highlights

Boy Died in Crackers Blast: కర్నూలు నగరంలోని సీతారాం నగర్​లో విషాదం చోటు చేసుకుంది.. ఓ ఇంట్లో నిల్వ చేసిన బాణసంచా పేలి బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి గాయాలయ్యాయి. ఇంటి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

blast
blast

By

Published : Dec 22, 2022, 6:13 PM IST

Boy died in Explosion of Firecrackers: కర్నూలు నగరంలోని సీతారాం నగర్​లోని ఓ ఇంట్లో బాణసంచా పేలి ఓ బాలుడు మృతి చెందాడు. సీతారామ నగర్​కు చెందిన జీవరాజు ఇంట్లో అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచి.. వాటిని క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చీలకు తరలించేందుకు ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాణాలు పేలాయి. ఈ ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి ప్రేమ సందేశ్ అలియాస్ నాని (14) అక్కడికక్కడే మృతి చెందగా.. సుంకన్న అలియాస్ కృపాకర్ (17) అనే బాలుడికి గాయాలయ్యాయి. ఇంట్లో బాణసంచా పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచి ప్రమాదానికి కారణమైన రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ పిల్లలు బాణసంచా పనికి పోయే విషయం తమకు తెలియదని భాదితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details