కృష్ణాజిల్లా మైలవరంలో గత నెల 26వ తేదీన జరిగిన దారి దోపిడీ(FACEBOOK FRIENDSHIP: ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్‌బుక్ పరిచయం) కేసును పోలీసులు ఛేదించారు. దయాకర్ అనే వ్యక్తి... యార్లగడ్డ డేవిడ్‌కు ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ పెట్టి మోసగించాడని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు దయాకర్ బాధితుడికి పరిచయస్తుడేనని పేర్కొన్నారు.
అక్టోబర్ 25వ తేదీ రాత్రి పుల్లూరు రమ్మని చాట్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత దాడి చేసి 3 ఉంగరాలు, చైన్ దోచుకుని గొంతు కోశారని చెప్పారు. గుర్తించకుండా ఉండేందుకు ముఖానికి మంకీ క్యాప్‌లు ధరించారన్నారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులు దయాకర్, ఫణిలను విజయవాడలో అరెస్ట్ చేశామన్నారు. ఫేస్‌బుక్ చాటింగులు నమ్మి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు.