AUTO OVERTURNED: ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన మహిళా కూలీలు ప్రయాణిస్తున్న ఆటో.. ప్రమాద వశాత్తూ మున్నేరు కాలువలోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో ఆటోను తప్పించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. వేమవరం నుంచి పెనుగంచిప్రోలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ACCIDENT మున్నేరు కాలువలో ఆటో బోల్తా.. ఇద్దరు మృతి - ఆటో బోల్తా
AUTO ACCIDENT: ఎదురుగా వస్తున్న మరో ఆటోను తప్పించబోయి.. కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. పరిగెత్తుకెళ్లి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఆటోలోని వారిని బయటకు తీశారు. కానీ.. ఆటోలో ముందు భాగంలో కూర్చున్న ఓ మహిళ నీటిలో మునిగి మరణించింది. మిగిలిన 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని మరో ఆటోలో పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మిగతా వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెనుగంచిప్రోలు ఆస్పత్రి సిబ్బంది క్షతగాత్రులను పట్టించుకోవడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: