కర్నూలు జిల్లా ఆస్పరి మండలం డి.కోటకొండలోని ఓ పొలం విషయంలో రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. పరస్పరం గొడ్డళ్లతో దాడి చేసుకున్నాయి. నకిలీ సంతకాలతో పొలం ఆక్రమించుకున్నారని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఘటనపై ఆదోని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.