MURDER ATTEMPT ON LECTURER : అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో సుమంగళి అనే లెక్చరర్‌పై ఆమె భర్తే హత్యాయత్నం చేశాడు. కళాశాల మైదానంలో కత్తితో గొంతుకోశాడు. లెక్చరర్ కేకలు విన్న తోటి సిబ్బంది, విద్యార్థులు రక్తపుమడుగులో ఉన్న ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. భార్య గొంతుకోసి పరారవుతున్న భర్తను తోటి లెక్చరర్లు పట్టుకుని.. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. భర్తతో విభేదాల కారణంగా కోర్టులో విడాకుల కోసం కేసు వేశారు. కోర్టులో కేసు ఉండగానే సుమంగళిపై భర్త పరేశ్ హత్యాయత్నం చేశాడు. రాయదుర్గానికి చెందిన సుమంగళి.. కామర్స్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. సుమంగళి.. ఇటీవలే గుంటూరు ఎయిడెడ్ కళాశాల నుంచి అనంతపురానికి బదిలీ అయ్యారు.
అనంతపురంలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త - కళాశాలలో లెక్చరర్‌పై హత్యాయత్నం
Attack On Arts Lecturer : కుటుంబకలహాల నేపథ్యంలో ఓ భర్త..తన భార్యపై దాడి చేసిన ఘటన అనంతపురంలో కలకలం రేపింది. ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సుమంగళి అనే మహిళపై ఆమె భర్త కత్తితో దాడిచేశాడు.
MURDER ATTEMPT ON LECTURER