ARREST: ఏటీఎం కేంద్రాల్లో సహాయం చేస్తున్నట్లు నటించి డబ్బులు, కార్డులు దొంగిలించే ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 125 ఏటీఎం కార్డులు, కారు, 28వేల రూపాయలను, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కంచరపాలేనికి చెందిన విశ్రాంత ఉద్యోగి నాగేంద్ర గత నెల 10న నగదు జమ చేయాలని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లగా.. అక్కడే ఉన్న దుండగుడు నాగేంద్రను బలంగా కొట్టి.. ఏటీఎం కార్డు, 9 వేల రూపాయల నగదు తీసుకుని పరారయ్యాడు.
ARREST: డబ్బులు, ఏటీఎం కార్డులు దొంగిలించే ముఠా అరెస్ట్..
ARREST: ఏటీఎం కేంద్రాల్లో సహాయం చేస్తున్నట్లు నటించి డబ్బులు, కార్డులు దొంగిలించే ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 125 ఏటీఎం కార్డులు, కారు, 28వేల రూపాయలను, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డబ్బులు, ఏటీఎం కార్డులు దొంగిలించే ముఠా అరెస్ట్..
బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయా ఏటీఎం కేంద్రాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. రైల్వేస్టేషన్ సమీపంలో నలుగురు యువకులను గుర్తించి ఆరా తీశారు. వారు ఇచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా.. ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న హరియాణాకు చెందిన సందీప్‌ను పోలీసులు గుర్తించారు. సందీప్ నేతృత్వంలో నెల్లూరు, హైదరాబాద్, కర్ణాటక, హరియాణాలో.. ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: