వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి హత్యాయత్నం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లోకి ప్రవేశించి బ్యాట్‌తో దాడిచేశారు. గతేడాదిలోనూ సూరీడుపై సురేంద్రనాథ్‌రెడ్డి దాడి చేయడం గమనార్హం.
హైదరాబాద్‌లో వైఎస్ఆర్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం - సూరీడిపై హత్యాయత్నం
YSR follower suridu
12:12 March 24
సూరీడిపై బ్యాట్‌తో దాడిచేసిన అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి
భార్యపై వేధింపులతో సురేంద్రనాథ్‌రెడ్డిపై గతంలో గృహహింస కేసు నమోదైంది. కుమార్తెను వేధిస్తున్నాడనే ఆరోపణలతో అల్లుడిపై సూరీడు ఫిర్యాదు చేశారు. కేసు ఉపసంహరించుకోవాలని సురేంద్రనాథ్ ఒత్తిడి తీసుకొచ్చేవారని ఆయన కుమార్తె తెలిపారు. ఆ కక్షతోనే దాడి చేసినట్లు పేర్కొన్నారు. సూరీడు కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. సురేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి
Last Updated : Mar 24, 2021, 1:22 PM IST