MURDER IN VISAKHA : విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రమ్ములో మృతదేహం కేసులో చిక్కుముడి వీడింది. విశాఖ సీపీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. కేసు విచారణ కోసం పోలీసు బృందాలు శ్రీకాకుళం జిల్లాలో విచారించాయి. మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి(24)గా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగి సుమారుగా సంవత్సరంన్నర గడిచింది. ఇంతకాలం మృతదేహం ఇంట్లోనే ఉండడంతో విశాఖ వాసులు భయాందోళనకు గురయ్యారు.
నిందితుడు మధురవాడలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సంవత్సరంన్నర కాలంగా యజమానికి అద్దె బకాయి పడ్డాడు. ఎన్ని సార్లు అద్దె చెల్లించాలని యజమాని కోరినా తాత్సారం చేస్తూ వచ్చారు. విసిగిపోయిన ఇంటి యజమాని గదిని స్వాధీనం చేసుకునే క్రమంలో సామాన్లు బయటకు తరలించేటప్పుడు డ్రమ్ములో శవం ఉన్నట్లు తెలిసింది. ఆందోళనకు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ ఇంట్లో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటకు చెందిన రుషిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తొలుత అతను అద్దెకు ఉన్న ఇంట్లో లభించిన మృతదేహం ఎవరిదన్న విషయాన్ని పోలీసులు రహస్యంగానే ఉంచారు. నిందితుడికి సహకరించిన వ్యక్తులెవరు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే వివరాలను రాబడుతున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో ముద్దలుగా మారి కుళ్లిన స్థితికి చేరిన శరీర భాగాలను శవపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు పంపించారు. ఆ నివేదికను విశ్లేషిస్తున్నారు.
మృతురాలు శ్రీకాకుళం జిల్లా వాసి..?
మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మిగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె చాలా కాలం క్రితం ఇల్లు వదిలి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె ఎవరితోను టచ్‌లో లేనట్లు తెలిసింది. రుషి భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో స్థానిక బస్టాప్‌లో నిందితుడికి పరిచయం అయింది. ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు అమెతో జరిగిన వాగ్వాదంలో హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు విచారణలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.
మృతదేహాన్ని ముక్కలు చేయలేదు..: సీపీ