హైదరాబాద్ వనస్థలిపురంలోని మన్సూరాబాద్‌లో ఓ వ్యక్తిని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా నివసించే గగన్‌దీప్‌ను అతని భార్య నౌషాద్ బేగం...గగన్ స్నేహితుడు సునీల్ సహాయంతో హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది.
పోలీసుల దర్యాప్తులో వీరిద్దరే హత్య చేసినట్టు తేలడంతో నౌషాద్ బేగంను అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన సునీల్ పరారీలో ఉండగా... గాలింపు చేపట్టి పురానాపూల్ ప్రాంతంలో సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు.