ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

loan app case: మళ్లీ తెర మీదికి రుణ యాప్‌ల కేసు.. మరో రూ.51 కోట్ల ఆస్తులు అటాచ్ - online loan app case

సంచలనం సృష్టించిన రుణయాప్​ల కేసు మరోసారి తెరమీదికొచ్చింది. గతంలో పీసీ ఫైనాన్షియల్‌కు చెందిన రూ.238 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ.. అదే సంస్థకు చెందిన రూ.51 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.

Loan app
Loan app

By

Published : Dec 15, 2021, 9:45 PM IST

loan app case: సంచలనం సృష్టించిన రుణయాప్​ల కేసు మరోసారి తెరమీదికొచ్చింది. ఈ కేసులో మరో రూ.51 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. గతంలో పీసీ ఫైనాన్షియల్‌కు చెందిన రూ.238 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ.. అదే సంస్థకు చెందిన రూ.51 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.

క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా పీసీఎఫ్ఎస్ రుణాలు ఇచ్చింది. చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో పీఎస్ఎఫ్ఎస్ పనిచేస్తోందని ఈడీ వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్​కు సుమారు రూ.429 కోట్లు తరలించినట్లు ఈడీ పేర్కొంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేస్తున్నట్టు ఈడీ స్పష్టం చేసింది. ఈడీ దర్యాప్తు ఆధారంగా ఆర్బీఐ, ఐటీ విచారణ ప్రారంభించాయి.

ఇవీ చూడండి:DCC Bank ATM Robbery: ఏటీఎంలో రూ.4.95 లక్షలు నగదు తేడా...అనుమానం వచ్చి పరిశీలిస్తే..

ABOUT THE AUTHOR

...view details