JAWAN FUNERALS జమ్ముకశ్మీర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు జవాన్‌లలో.. అన్నమయ్య జిల్లా వాసి రాజశేఖర్ ఉండటంతో ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామానికి చెందిన రాజశేఖర్.. 14 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి సేవలందించారు. అమర్‌నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా.. బస్సు ప్రమాదంలో రాజశేఖర్ మృతి చెందారు. రాజశేఖర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజశేఖర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకెవ్వరు దిక్కంటూ రోదిస్తున్నారు. గురువారం ఉదయానికి మృతదేహం స్వస్థలానికి చేరుస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
జమ్ముకశ్మీర్ ప్రమాదంలో జవాన్ మృతి, రేపు అన్నమయ్య జిల్లాకు భౌతికకాయం
FUNERALS OF JAWAN జమ్ముకశ్మీర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో అన్నమయ్య జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే జవాన్ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
JAWAN FUNERALS
Last Updated : Aug 17, 2022, 10:45 PM IST