ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

అమర్​నాథ్​ యాత్రలో విషాదం.. అనకాపల్లి వాసి మృతి - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

DIED: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన అనకాపల్లి వాసి ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. బద్రీనాథ్‌లో దర్శనం ముగించుకుని రాత్రి అక్కడే బస చేసిన గవరపాలెంలోని నీలకంఠం వీధికి చెందిన బోడాల సూరి అప్పారావు.. ఊపిరి ఆడక మరణించాడు.

DIED
DIED

By

Published : Jul 13, 2022, 6:17 PM IST

DIED: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన అనకాపల్లి వాసి ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. గవరపాలెంలోని నీలకంఠం వీధికి చెందిన బోడాల సూరి అప్పారావు ఈనెల రెండో తేదీన 15 మందితో కలిసి అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. బద్రీనాథ్‌లో దర్శనం ముగించుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఊపిరి అందక ఇబ్బందిపడిన అప్పారావును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పారావు మృతదేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పారావు కుటుంబ సభ్యులను అనకాపల్లి తహశీల్దార్‌ పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details