ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Suicide Attempt: తన గొంతు తానే కోసుకుంది.. హత్యాయత్నంగా నమ్మించే క్రమంలో దొరికిపోయింది! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

తెలంగాణలోని కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఓ వివాహిత.. బ్లేడుతో తన గొంతు తానే కోసుకొని హత్యాయత్నంగా నమ్మించే యత్నం చేసినట్లు పోలీసులు నిర్ధరించారు.

An unidentified man strangled a young woman in Camareddy
బ్లేడుతో తన గొంతు తానే కోసుకున్న వివాహిత

By

Published : Aug 31, 2021, 7:10 PM IST

తన గొంతు తానే కోసుకొని హత్యాయత్నంగా నమ్మించాలని చూసిన వివాహిత

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్‌పురా కాలనీకి చెందిన వివాహిత గొంతు కోసిన ఘటన కీలక మలుపు తిరిగింది. బ్లేడుతో వివాహితే గొంతు కోసుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. తొలుత హత్యాయత్నంగా నమ్మించడానికి యత్నించినట్లు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఇంట్లో పనులు చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

బాధితురాలి కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. గతంలో ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 2 నెలల క్రితం కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు వెల్లడించారు. 9 నెలల క్రితం కామారెడ్డి యువకుడితో ఆమెకు వివాహం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details