Fire accident: రిఫ్రిజిరేటర్‌లో మంటలు చెలరేగి వృద్ధురాలి మృతి - ap top news
08:02 September 04
మరో ముగ్గురికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
అనంతపురం జిల్లా నాయక్ నగర్లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నాయక్ నగరలో నివాసముంటున్న లక్ష్మీదేవి(65), చంద్రశేఖర్ రెడ్డి(40), శరణ్ తేజ రెడ్డి(10), కాశ్యరెడ్డి(8)లు శుక్రవారం రాత్రి నిద్రపోతున్న సమయంలో.. షాట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పక్కనే పడుకున్న లక్ష్మీదేవికి అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, శరణ్ తేజ రెడ్డి, కాశ్య రెడ్డిలకు గాయాలయ్యాయి.
విషయం గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పడికే మంటలు ఆరిపోవడంతో.. అగ్నిమాపక సిబ్బంది వెనుదిరిగారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:APASSEMBLY SESSIONS: 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు!