old man yoga performance: యోగాసనాల సాయంతో నీటిలో తేలియాడుతున్న ఈ పెద్దాయన పేరు అచ్యుతరామరాజు. వయస్సు 70 ఏళ్లు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం అలకాపురంలో నివాసం ఉంటున్నారు. అచ్యుతరామరాజుకు చిన్నప్పటి నుంచి ఈత కొట్టే అలవాటు ఉండేది. కానీ ఐదేళ్ల క్రితం సయాటికా నొప్పి రావడంతో.. ఈత కొట్టడానికి ఇబ్బంది పడేవారు. ఆ తర్వాత నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వెనక్కి తిరిగి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నొప్పి తగ్గుతున్నట్లు గుర్తించారు. అదే సమయంలో.. నీటిలో యోగాసనాలు వేయడం గురించి తెలుసుకున్నారు. అలా ఈతతో పాటు ఆసనాలు అభ్యసించారు.
స్వగ్రామైన అలకాపురంలో చెరువు లేకపోవటంతో.. సమీపంలోని సంగుపాలెం కోడూరు గ్రామ చెరువులో అచ్యుతరామరాజు ఆసనాలు వేస్తున్నారు. ఇప్పుడు కార్తిక మాసం కావటంతో ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో.. చెరువులో ఆసనాలు వేస్తూనే దీపాలు వెలిగించి అందరినీ అశ్చర్యపరుస్తున్నారు.