విజయనగరం జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్ అండ్ బీ సమీపంలోని పోలీస్ బ్యారెక్స్ వద్ద ఓ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్నర కనికల నారాయణరావు(57) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన ఇంట్లోనే టీ కొట్టు నిర్వహిస్తుండగా.. ఇంటితో పాటు దుకాణం కూడా పూర్తిగా ధ్వంసమైంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ROAD ACCIDENT: అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. నిద్రిస్తున్న వృద్ధుడు మృతి - ఏపీ లేటెస్ట్ న్యూస్
విజయనగరం జిల్లా కేంద్రంలో లారీ అదుపుతప్పి.. నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా... ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది.
అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. నిద్రిస్తున్న వృద్ధుడు మృతి..
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి కావడం, రోడ్లు ఖాళీగా ఉండటం వల్లే పెనుప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.
ఇదీ చూడండి:Mahapadayathra: రెండోరోజు మహాపాదయాత్ర.. కదం కలిపి కదిలిన రైతులు..