SUICIDE: విజయనగరం జిల్లా రేగిడి మండల కేంద్రంలోని సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హరి(32) అనే ఉద్యోగి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం విధులు నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్లకుండా తోటి సిబ్బంది వద్ద సచివాలయం తాళాలు తీసుకుని అందులోనే ఉన్నాడు. బుధవారం ఉదయం సిబ్బంది విధులకు వచ్చి చూడగా ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రాజాం రూరల్ సీఐ నవీన్ కుమార్..ఉద్యోగి మృతికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. అలాగే సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు.. వాలంటీర్లు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
సచివాలయంలో పడుకున్నాడు.. తెల్లవారి తలుపు తీసేసరికి..! - విజయనగరం జిల్లా తాజా వార్తలు
SUICIDE: రేగిడి మండల కేంద్రంలోని సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్య
Last Updated : May 25, 2022, 2:34 PM IST