Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటి ముమైత్ ఖాన్
10:27 September 15
mumaith-khan
టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు నటి ముమైత్‌ఖాన్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు.
ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు హాజరయ్యారా? మీరు ఎప్పుడైనా మాదకద్రవ్యాలు వినియోగించారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలతో మీకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: YS Viveka murder case: పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలిస్తున్న సీబీఐ