టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో తొలిరోజు మంగళవారం.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు విచారించారు. మొత్తం 12 మంది సినీ ప్రముఖుల్ని విచారించేందుకు సమాయత్తమైన ఈడీ గురువారం రోజున హాజరు కావాలని చార్మికి సమన్లు జారీ చేసింది.
Tollywood drugs case: సినీనటి ఛార్మిపై ఈడీ ప్రశ్నల వర్షం... కెల్విన్ సమాచారమే కీలకం! - డ్రగ్స్ కేసు వార్తలు
10:39 September 02
charmi
ఈ క్రమంలో ఈడీ కార్యాలయానికి చార్మి చేరుకున్నారు. ఆమె బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలపై విచారణ కొనసాగనుంది. 2017లో డ్రగ్స్ కేసులో చార్మి.. ఎక్సైజ్ విచారణ ఎదుర్కొన్నారు. కెల్విన్ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కెల్విన్ నుంచి బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు సేకరించారు.
కెల్విన్, ఇద్దరు అనుచరుల ఫోన్లలో గతంలో లభించిన తారల వివరాల ఆధారంగానే నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 8మంది సరఫరాదారుల బ్యాంకు ఖాతాలు సేకరించిన అధికారులు.. అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: Gold Rate Today: ఏపీ, తెలంగాణలో మళ్లీ తగ్గిన బంగారం ధర