ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Tollywood Drugs case : ఈడీ కార్యాలయంలో కెల్విన్​.. 4 గంటలుగా నందు విచారణ

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. సినీ నటుడు నందును ఈడీ అధికారులు సుమారు 4 గంటలుగా విచారిస్తున్నారు. నందుకి సంబంధించిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

actor nandhu
actor nandhu

By

Published : Sep 7, 2021, 4:23 PM IST

ఈడీ కార్యాలయంలో కెల్విన్​.. 4 గంటలుగా కొనసాగుతున్న నందు విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood Drugs case)లో ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. తాజాగా సినీ నటుడు నందును ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సుమారు 4 గంటలుగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ కేసులో కీలకమైన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్​ను కూడా ఈడీ కార్యాలయానికి రప్పించారు. ఓవైపు నందును విచారిస్తూనే కెల్విన్​ను కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇరువురిని ప్రశ్నించి కీలక ఆధారాలు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి, నటి రకుల్ ప్రీత్ సింగ్​లను విచారించారు. మనీలాండరింగ్ కేసు (Tollywood Drugs case)లో నందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. షూటింగ్ వల్ల ముందుగా విచారించాలని నందు అధికారులను కోరగా.. వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నందు బ్యాంక్ ఖాతాలు, అనుమానాస్పద లావాదేవీల గురించి ఈడీ ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం.

కెల్విన్​ను ప్రశ్నిస్తున్న అధికారులు...

డ్రగ్స్ కేసులో కీలక సరఫరాదారుడు కెల్విన్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కెల్విన్‌తో పాటు పాతబస్తీకి చెందిన మరో ఇద్దరు వాహిద్, కుదూస్‌ను అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. నిందితులు, నటుడు నందూ మధ్య లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు.. కెల్విన్ నుంచి బ్యాంకు స్టేట్​మెంట్లు సేకరించారు.

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 8న రానా విచారణకు రానున్నారు.

  • ఇదీ చదవండి :

Drugs Case: డ్రగ్స్ వివాదంపై ప్రకాశ్​రాజ్ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details