IMPRISONMENT:బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి, గర్భిణిని చేసిన కేసులో నిందితుడికి 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్ సోమవారం తీర్పు వెలువరించారు. పోక్సో కేసుల ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కసనూరు విద్యాపతి తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన బాబునాయక్ అలియాస్ అశోక్‌నాయక్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చింది. తర్వాత నిందితుడు కనిపించకుండాపోయాడు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు పామిడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సీ, ఎస్టీ విభాగపు డీఎస్పీ మహబూబ్‌బాషా కేసు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఇరువర్గాల వాదనలను పరిశీలించింది. ప్రాసిక్యూషన్ తరఫున విద్యాపతి వాదనలు వినిపించారు. కోర్టు 9 మంది సాక్షులను విచారించింది. నిందితుడిపై నేరారోపణ రుజువు కావడంతో 13 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 13ఏళ్ల జైలు శిక్ష - అనంతపురం జిల్లా తాజా వార్తలు
IMPRISONMENT: బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి, గర్భిణిని చేసిన కేసులో నిందితుడికి 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్ తీర్పు వెలువరించారు.
IMPRISONMENT