Accused who attacked a girl in the name of love: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో బాలికతోపాటు ఆమె బంధువులపై యువకుడు, అతడి బంధువులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన ఘటనలో.. 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. దాడికి ఉపయోగించిన కర్రలు, రాళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యువకుడు మణికంఠ అతని తమ్ముడు ఏడుకొండలు మరి కొంతమంది కలిసి బాలికను ఆమె కుటుంబీకులను గాయపరిచారన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది జరిగింది: పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో బాలికతోపాటు ఆమె బంధువులపై యువకుడు, అతడి బంధువులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. ఈ ఘటనలో మొత్తం 11మందికి గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. ఫిరంగిపురానికి చెందిన బాలికకు పెళ్లి కుదిరింది. గ్రామంలోని ప్రకాశం పంతులు వీధికి చెందిన మణికంఠ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెట్టాడు. దీనిపై మాట్లాడుకునేందుకు రెండు కుటుంబాలవారు సమావేశమయ్యారు.