ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు నిందితులు - krishna latest news

పలు దొంగతనాల్లో అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనాలతో పాటు కొన్ని నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు. విచారణ అనంతరం వారిని సూర్యారావుపేట పోలీసులకు అప్పగించగా.. తెల్లవారుజామున తప్పించుకున్నారు.

accuse escape from police custody in vishakha
accuse escape from police custody in vishakha
author img

By

Published : Jul 13, 2021, 12:56 AM IST

ఇద్దరు నేరస్తులు పోలీసు కస్టడీ నుంచి పారిపోవటం విజయవాడలో కలకలం రేపింది . విజయవాడ సీసీఎస్ పోలీసులు సంపత్ కుమార్ , గౌతమ్ అనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు . విచారణలో వాళ్లు పాత నేరస్తులని తేలింది. పలు ఇళ్లలో దొంగతనాలతోపాటు.. నేరాలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. విచారణ అనంతరం సూర్యారావుపేట పోలీసులకు నిందితులను అప్పగించారు . వారిని పోలీసు ఆవరణలో ఉంచగా.. ఆదివారం తెల్లవారు జామున నిందితులు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నారు . పారిపోయే సమయంలో పోలీస్ స్టేషన్​లో ఓ హెడ్ కానిస్టేబుల్ , ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు సమాచారం . నేరగాళ్లు పారిపోయిన విషయాన్ని పోలీసులు బయటకు తెలియనివ్వలేదు . తప్పించుకున్న నేరస్తులను గాలించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం .

ఇదీ చదవండి:ఇసుక రీచ్​లో చిక్కుకున్న కార్మికులు.. సురక్షితంగా ఒడ్డుకు..!

ABOUT THE AUTHOR

author-img

...view details