ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ట్రావెల్స్​ బస్సు బోల్తా.. 21 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం - bus accident at srikakulam

శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. 41 మందితో కేరళ వెళ్తున్న ఓ ట్రావెల్స్​ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మందికి గాయాలయ్యాయి.

Accident to Travels bus and  21 injured four were seroius
Accident to Travels bus and 21 injured four were seroius

By

Published : Jun 20, 2022, 9:21 AM IST

Updated : Jun 20, 2022, 11:13 AM IST

శ్రీకాకుళం జిల్లా నందిగాo మండలం పెద్ద తామరాపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మందికి గాయాలు అవ్వగా... అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణిస్తుండగా.. 21 మందికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. వీళ్లంతా బంగాల్ నుంచి కేరళ వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Last Updated : Jun 20, 2022, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details