విజయనగరం జిల్లా కొమరాడ మండలం రామభద్రపురం గ్రామానికి చెందిన రిషిరోహిత్ అనే ఆరేళ్ల బాలుడు లారీ ప్రమాదంలో మృతి చెందాడు. పెరుగు పొట్లం కోసం దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా బాలుడిని లారీ ఢీకొట్టింది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన బిడ్డ ఇక లేడని, తిరిగి రాడని తెలిసి ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెపగిలేలా ఏడుస్తున్న సంఘటన చూపరులను కంటతడిపెట్టించింది.
లారీ ఢీకొని బాలుడు మృతి - విజయనగరం జిల్లా న్యూస్
లారీ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో జరిగింది. బాలుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పెరుగు ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్లిన తమ బిడ్డ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని మృతుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
accident in Vizianagaram